రూ.13999 ధరకే 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ, మీడియాటెక్ చిప్‌సెట్‌తో 5G స్మార్ట్‌ఫోన్!
Realme Narzo 90x 5G Smartphone : రియల్‌మి నార్జో 90 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఇందులో నార్జో 90 5G, నార్జో 90x 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీ ఉంది. దీంతోపాటు 50MP కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల (720 x 1570 పిక్సల్స్) LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్, 7000mAh బ్యాటరీ :
ఈ నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్పీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలతో 30fps వద్ద 1080p వీడియోలను రికార్డు చేయవచ్చు. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి.
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.13999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499 గా ఉంది. డిసెంబర్ 23 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఇండియా, అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఫ్లాష్ బ్లూ, నిట్రో బ్లూ కలర్ వేరియంట్స్ లభిస్తుంది.
రియల్‌మి నార్జో 90 5G ఫోన్ :
ఈ సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన మరో ఫోన్ రియల్‌మి నార్జో 90 5G ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.57 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సర్ ఉన్నాయి. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.


Click it and Unblock the Notifications








