Home
Mobile

రూ.13499 ధరకు 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో స్మార్ట్‌ఫోన్‌!

Realme Narzo 90x 5G Smartphone : రియల్‌మి సంస్థ భారత్‌ మార్కెట్‌ లో జనవరి 6 వ తేదీన రియల్‌మి 16 సిరీస్‌ విడుదల అయింది. దీంతోపాటు ట్యాబ్లెట్, ఇయర్‌బడ్స్‌ కూడా విడుదల అయ్యాయి. అయితే గత నెలలో విడుదల అయిన రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ ను కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 7000mAh భారీ బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది.

రూ.500 కూపన్‌ కోడ్‌ :
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది. అమెజాన్‌ లో ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.500 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

Realme Narzo 90x 5G pricedrop

కలర్ వేరియంట్స్‌ :
రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ లోనూ రూ.500 కూపన్ కోడ్‌ డిస్కౌంట్‌ ను అందిస్తోంది. ఫలితంగా ఈ ఫోన్‌ ను రూ.13499. రూ.14999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాష్‌ బ్లూ, నిట్రో బ్లూ కలర్‌ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్‌ రేట్ తో 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. వెట్‌ హ్యాండ్‌ టచ్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 3 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు 50MP సోనీ IMX852 కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 30fps తో 1080p వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తాయి. డ్యూయల్‌ వ్యూ వీడియో, AI Edit Genie వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫాస్ట్ ఛార్జింగ్‌, 7000mAh బ్యాటరీ :
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ 60W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్ ఉంది. మెరుగైన ఆడియో సపోర్టును కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 90x 5G with 7000mAh battery, 50MP Camera gets Rs500 coupon code discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X