Home
Mobile

రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. భారత్‌ మార్కెట్‌లో జులై 29న విడుదల.. పూర్తి వివరాలు..!

రియల్‌మి నుంచి మరో స్మార్ట్‌ ఫోన్ భారత్‌ మార్కెట్‌ లోకి రానుంది. సంస్థ తన సోషల్‌ మీడియా ద్వారా ఈ అంశాన్ని వెల్లడించింది. ఈ రియల్‌మి నార్జో N61 స్మార్ట్‌ ఫోన్‌ (Realme Narzo N61 Smartphone Launch Date) డిజైన్‌ మరియు కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలను షేర్‌ చేసింది. ఈ హ్యాండ్‌ సెట్ భారత్‌ లో జులై 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ ఫోన్‌ అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది.

ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్మర్‌షెల్‌ రక్షణను కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుంది. ఈ ఫోన్‌ రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా తడి చేతులతో కూడా నియంత్రించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ మిగిలిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Realme narzo N61 Smartphone launch date confirmed in india

ఇప్పటికే ఈ సిరీస్‌లో నార్జో N63 మరియు నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ గత నెలలో భారత్‌లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు Unisoc T612 చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. 4GB LPDDR4X ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడింది.

నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత 50MP వెనుక కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. మరియు 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499 గా ఉంది.

రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 ను కలిగి ఉంటుంది. మరియు 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 5G SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా సహా 2MP మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme narzo N61 Smartphone to launch on july 29 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X