Home
Mobile

ధర రూ.7999 కే 50MP AI కెమెరా, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, సేల్‌ వివరాలు..!

రియల్‌మి నార్జో N సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా రియల్‌మి నార్జో N63 హ్యాండ్‌సెట్‌ను ( Realme Narzo N63 Smartphone launched ) భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత 50MP కెమెరాను కలిగి ఉంది. రెండు ర్యామ్‌ మరియు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ప్రీమియం వేగాన్ లెదర్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. రియల్‌మి వెబ్‌ సైట్ ద్వారా కొనుగోలుపై డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటన చేసింది.

రియల్‌మి నార్జో N63 స్పెసిఫికేషన్‌, ఫీచర్‌లు :
రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1600*720 పిక్సల్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 450 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిని క్యాప్సుల్‌ ఫీచర్‌తో వస్తుంది.

realme narzo N63 smartphone launched

ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI తో వస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ Unisoc T612 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Mali G57 GPU తో జతచేయబడి ఉంటుంది. 4GB LPDDR4x ర్యామ్‌ మరియు గరిష్ఠంగా 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్ 50MP AI ఆధారిత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఎయిర్‌ గెశ్చర్‌, డైనమిక్ బటన్‌, మిని క్యాప్సుల్‌ 2.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా 4G VoLTE, వైఫై, బ్లూటూత్‌ 5.0, GPS, USB-C వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌గా లాంచ్‌ అయింది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

realme narzo N63 smartphone launched

రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8999 గా ఉంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌ లో జూన్‌ 10 నుంచి మధ్యాహ్నం 12PM నుంచి సేల్‌ ప్రారంభం అవుతుంది. జూన్‌ 14 వరకు తొలి సేల్‌ అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 అదే 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌తో లెదర్‌ బ్లూ, ట్విలైట్‌ పర్పుల్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
realme narzo N63 smartphone launched in india with AI backed 50MP camera specs and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X