Home
Mobile

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ సేల్‌.. ధర రూ.7999..!

రియల్‌మి నుంచి ఇటీవల నార్జో N63 స్మార్ట్‌ ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌ సెట్‌ 50MP కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ మరియు 45W వైర్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. ప్రీమియం లెదర్‌ ఆప్షన్‌ తో అందుబాటులో ఉంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ ఫోన్ ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. రియల్‌మి అధికారిక వెబ్‌ సైట్‌ సహా అమెజాన్‌ ద్వారా ( Realme Narzo N63 Smartphone sale ) కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో భారత్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8,499 గా ఉంది. అదే 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8,999 గా ఉంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్‌ను రూ.7,999 కే కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo N63 Smartphone sale is live

ఈ రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ లెదర్‌ బ్లూ, ట్విలైట్‌ పర్పుల్‌ కలర్‌ ఆప్షన్‌లలో లభిస్తుంది. అయితే లెదర్ బ్లూ కలర్‌ వేరియంట్‌ మాత్రమే లెదర్‌ ఫినిష్‌తో లభిస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ తొలి సేల్‌ జూన్‌ 10 న ప్రారంభం అయింది. జూన్‌ 14 వరకు ఈ సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

రియల్‌మి నార్జో N63 స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600*720 పిక్సల్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 450 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిని క్యాప్సుల్‌ ఫీచర్‌తో వస్తుంది.

రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 50MP AI ఆధారిత (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఎయిర్‌ గెశ్చర్‌, డైనమిక్ బటన్‌, మిని క్యాప్సుల్‌ 2.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI తో వస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ Unisoc T612 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Mali G57 GPU తో జతచేయబడి ఉంటుంది. 4GB LPDDR4x ర్యామ్‌ మరియు గరిష్ఠంగా 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది.

ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా 4G VoLTE, వైఫై, బ్లూటూత్‌ 5.0, GPS, USB-C వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌గా లాంచ్‌ అయింది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Realme Narzo N63 Smartphone sale started on amazon and realme website specs and offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X