Home
Mobile

ధర రూ.11499 కే 8GB ర్యామ్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

రియల్‌మి నుంచి గత సంవత్సరం భారత్‌ మార్కెట్‌ లోకి రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo N65 5G Smartphone Price Drop) విడుదల అయింది. ఈ ఫోన్ బడ్జెట్‌ రేంజ్‌ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 50MP కెమెరాతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌ లో (Amazon) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు కూపన్‌ డిస్కౌంట్‌ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌ లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో 4GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.10499 గా ఉంది. కూపన్‌ డిస్కౌంట్‌ ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ధర రూ.9499 గా ఉంది.

Realme Narzo N65 5G Smartphone telugu news

అదే విధంగా 6GB ర్యామ్ వేరియంట్‌ ను కూపన్ డిస్కౌంట్‌ తో కలిపి 10249 కే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా 8GB ర్యామ్ వేరియంట్‌ను రూ.11499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ డీప్‌ గ్రీన్‌, అంబర్‌ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.

రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 7.89 అల్ట్రా స్లిమ్‌ బాడీని కలిగి ఉంది.

Realme Narzo N65 5G Smartphone telugu news

ఈ నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 5G SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్మార్ట్‌ టచ్‌, మినీ క్యాప్సల్‌ 2.0 ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ క్విచ్‌ ఛార్జ్‌, రివర్స్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

* రియల్‌మి నుంచి నిన్న భారత్ మార్కెట్‌ లో P3 సిరీస్‌ లాంచ్‌ అయింది. ఇందులో భాగంగా రియల్‌మి P3 ప్రో 5G, P3x 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. P3x మోడల్‌ ప్రారంభ ధర రూ.13999 గా ఉంది. అదే ప్రో మోడల్ ధర రూ.23999 గా ఉంది. అయితే ఈ రెండు మోడళ్లపై వరుసగా రూ.1000, రూ.2000 బ్యాంక్‌ డిస్కౌంట్‌లను పొందవచ్చు.

రియల్‌మి P3 5G సిరీస్‌ 6000mAh బ్యాటరీ సహా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అయితే ప్రో మోడల్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ప్రో మోడల్‌ 6.83 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo N65 5G Smartphone gets RS1000 coupon code discount on amazon 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X