Home
Mobile

రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ ఖరారు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు..!

రియల్‌మి సంస్థ ఇటీవల భారత్‌ మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. బుధవారమే (మే 22) ఈ సంస్థ నుంచి రియల్‌మి GT 6T 5G స్నార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీంతోపాటు రియల్‌మి బడ్స్ వెర్‌లెస్‌ 3 నియో, బడ్స్‌ ఎయిర్‌ 6 ఇయర్‌బడ్స్‌ను కూడా లాంచ్‌ అయ్యాయి. తాజాగా భారత్‌లో త్వరలోనే మరో హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది.

రియల్‌మి నుంచి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo N65 5G Smartphone) మే 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుందని తెలిపింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు OS సహా స్టోరేజీ వేరియంట్ వివరాలు తెలియాల్సి ఉంది.

realme narzo N65 5G smartphone to launch on may 28 in india

దీంతోపాటు ఈ త్వరలో విడుదల కానున్న నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ కూడా కలిగి ఉంటుంది. ఫలితంగా తడి చేతులతోనూ నియంత్రించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు వృత్తాకార కెమెరాను కలిగి ఉంటుంది. అయితే కెమెరా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు ధరపైనా సంస్థ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

** రియల్‌మి C65 స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే తరహా డిజైన్‌ సహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. C65 స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 89.97 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోతో వచ్చింది. Feather గ్రీన్‌ మరియు గ్లోయింగ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 OS (Out Of The Box) మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ తో జతచేయబడింది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. 2 సంవత్సరాలపాటు OS, 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.

రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు f/1.8 అంగుళాల అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, మరియు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఫలితంగా ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో మెరుగైన కెమెరాలను కలిగి ఉన్నట్లయింది.

ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. రిటైల్‌ బాక్స్‌లో ఛార్జర్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా ఉండనుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, డ్యూయల్‌ 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme narzo N65 5G smartphone launch date confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X