ధర రూ.10499 కే 128GB స్టోరేజీ, 50MP కెమెరాతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్‌లు, సేల్ వివరాలు..!!
రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్‌లో నార్జో సిరీస్‌ను క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ను (Realme Narzo N65 5G Smartphone) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి నార్జో N65 5G స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్ వరకు జతచేయబడి ఉంటుంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా గరిష్ఠంగా 12GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు.

రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 89.97 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
మిని క్యాప్సుల్ 2.0 ఫీచర్ :
ఈ నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ మిని క్యాప్సుల్ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫోన్ ఛార్జింగ్ శాతం సహా ఇతర ముఖ్యమైన నోటిఫికేషన్‌లను ప్రదర్శిస్తుంది. ఈ ఫీచర్ పంచ్ హోల్ కటౌట్ వద్ద ఉంది. స్మార్ట్ టచ్ ఫీచర్ ద్వారా తడి చేతులతోనూ సౌకర్యవంతంగా ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. IP54 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా వస్తుంది.

39.4 గంటల కాలింగ్ టైం :
ఈ రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులోని క్విక్ ఛార్జింగ్ ఫీచర్ రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేయడం ద్వారా 39.4 గంటల కాలింగ్ టైంను పొందవచ్చు. మరియు 28 రోజుల స్టాండ్‌బై టైంను కూడా పొందవచ్చు.
50MP ప్రైమరీ కెమెరా :
నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా సహా 2MP మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ 5G నెట్‌వర్క్ సహా బ్లూటూత్, వైఫై సహా మరిన్ని ఫీచర్‌లతో లాంచ్ అయింది.

రియల్‌మి నార్జో N65 5G ధర, సేల్ వివరాలు..
రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ తొలి సేల్ మే 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ప్రారంభ ఆఫర్ కింద ఈ రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్‌ను కూపన్ డిస్కౌంట్ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ను రూ.10,499 కే కొనుగోలు చేయవచ్చు. మరియు 6GB వేరియంట్‌ను రూ.11,499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను అంబర్ గోల్డ్, డీప్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








