10001mAh భారీ బ్యాటరీతో మరో ఫోన్ విడుదల.. 6.8 అంగుళాల డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా సహా..!
Realme Narzo Power 5G : రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్లో గత నెలలో 10,001mAh బ్యాటరీ తో రియల్‌మి P4 పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అంతే బ్యాటరీ సామర్థ్యంతో మరో ఫోన్‌ను రియల్‌మి తీసుకొచ్చింది. రియల్‌మి నార్జో పవర్ 5G పేరుతో తాజాగా విడుదల చేసింది. భారీ బ్యాటరీతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు కూడా ఉన్నాయి.
రియల్‌మి నార్జో పవర్ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల (1280 x 2800 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS :
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు Arm Mali G615 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0 పైన పనిచేస్తుంది.
ఏకంగా 10,001mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 80W SUPERVOOC వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10,001mAh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. 27W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. 1-100 శాతం ఛార్జింగ్‌ను 85 నిమిషాల్లో పూర్తి చేస్తుందని రియల్‌మి చెబుతోంది.

ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 31.2 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ లేదా 21.4 గంటల నేవిగేషన్ కోసం వినియోగించుకోవచ్చని చెబుతోంది. సూపర్ పవర్ సేవింగ్ మోడ్‌లో కేవలం 5 శాతం ఛార్జింగ్‌తో ఏకంగా 218 నిమిషాల వరకు కాల్స్ మాట్లాడుకోవచ్చని లేదా 46.8 గంటల స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తుందని రియల్‌మి చెబుతోంది. రోజులో ఎక్కువ గంటలపాటు ఫోన్ అవసరం ఉండేవారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆటోఫోకస్, 2 యాక్సెస్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెకండరీ కెమెరా ఉంది. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై 5, GPS, QZSS, IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్ పోర్టు ఉంది. దీంతోపాటు ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్, టెంపరేచర్, గైరోస్కోప్, ఇ-కంపాస్, యాస్సెలిరోమీటర్ వంటి సెన్సర్‌లు ఉన్నాయి.
ఈ ఫోన్ HyperVision+ AI చిప్ కూడా ఉంది. భద్రత కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ Hi-Res ఆడియో సర్టిఫికేషన్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది.
రియల్‌మి నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ఆధారంగా మార్చి 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3 వేల డిస్కౌంట్‌ను అందిస్తామని సంస్థ తెలిపింది. దీంతోపాటు రూ.1000 అదనపు డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చని తెలిపింది. దీంతోపాటు 6 నెలల వరకు నోకాస్ట్ EMI ఆప్షన్ ఉంటుంది. రూ.2999 విలువైన 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీని కూడా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








