ఇవాళ్టి నుంచే 10,001mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ సేల్.. రూ.4000 డిస్కౌంట్, నోకాస్ట్ EMI సహా..!
Realme Narzo Power 5G Smartphone : భారత్‌లో రియల్‌మి సంస్థ 10,001mAh భారీ బ్యాటరీతో ఇటీవల రియల్‌మి నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఫిబ్రవరి నెలలో లాంచ్ అయిన రియల్‌మి P4 పవర్ 5G ఫోన్ కూడా 10,001mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే తాజాగా విడుదల అయిన నార్జో ఫోన్ భారీ బ్యాటరీతోపాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
రియల్‌మి నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29,999 గా ఉంది.

రూ.4 వేల డిస్కౌంట్ :
తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను అందిస్తామని రియల్‌మి తెలిపింది. దీంతోపాటు రూ.1000 అదనపు డిస్కౌంట్, 6 నెలల వరకు నోకాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ టైటాన్ బ్లూ, టైటాన్ సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 10,001mAh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 80W SUPERVOOC వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కేవలం 85 నిమిషాల్లోనే 1-100 శాతం ఛార్జింగ్ చేస్తుందని రియల్‌మి తెలిపింది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

మీడియాటెక్ చిప్, ఆండ్రాయిడ్ 16 OS :
ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G ప్రాసెసర్ ను కలిగి ఉంది. Arm Mali G615 GPU, HyperVision+ AI చిప్ కూడా ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీ సపోర్టును కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0 పైన పనిచేస్తుంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని రియల్‌మి హామీ ఇచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్, GPS, IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి. గైరోస్కోప్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్, టెంపరేచర్ సెన్సర్, యాక్సెలిరోమీటర్ సెన్సర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








