Home
Mobile

రియల్‌మి ప్రత్యేక సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు..! పూర్తి వివరాలు

Realme Narzo Super Saver Days Sale 2026 : రియల్‌మి సంస్థ ప్రస్తుతం ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. సూపర్‌ సేవర్‌ డేస్‌ పేరుతో ఇవాళ్టి నుంచి 24 తేదీ వరకు సేల్‌ జరుగుతుంది. ఈ రియల్‌మి సేల్‌లో భాగంగా నార్జో మోడల్స్‌పై డిస్కౌంట్‌లను పొందవచ్చు. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు రియల్‌మి P4 సిరీస్‌ మోడల్స్‌ పైనా ఆఫర్లను ప్రకటించింది.

రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. రియల్‌మి వెబ్‌సైట్‌, అమెజాన్‌లో రూ.500 కూపన్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

realme narzo 90 series

రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18499 గా ఉంది. రియల్‌మి వెబ్‌సైట్‌, అమెజాన్‌లో కూపన్ కోడ్ డిస్కౌంట్‌పై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. 60W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

realme narzo 90 series

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX852 కెమెరా, 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. నిట్రో బ్లూ, ఫ్లాష్‌ బ్లూ, మెరూన్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

రియల్‌మి నార్జో 90 5G ఫోన్‌ 6.57 అంగుళాల అమోలెడ్‌ ఫుల్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 మ్యాక్స్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. 60W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 2MP సెన్సర్‌, 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

రియల్‌మి నార్జో 80 లైట్ 5G :
రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10498, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12498 గా ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

రియల్‌మి నార్జో 80 లైట్‌ 4G స్మార్ట్‌ఫోన్ :
దీంతోపాటు రియల్‌మి నార్జో 80 లైట్‌ 4G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ రూ.8499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.9499 గా ఉంది. రియల్‌మి వెబ్‌సైట్‌లో కూపన్‌ కోడ్ ద్వారా రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.7999 కే కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Realme narzo super saver Days Sale 2026 Offers best deals on smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X