Home
Mobile

రియల్‌మి నుంచి కొత్త టీజర్‌ విడుదల.. అయితే అసలు విషయం దాచిపెట్టిన సంస్థ..!

రియల్‌మి భారత్‌ మార్కెట్‌లో ఇటీవల రియల్‌మి 12X 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే త్వరలోనే మరో హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను (Realme India) విడుదల చేసింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ ఏంటనేది తెలియాల్సి ఉంది.

కొత్త ఫోన్ GT సిరీస్‌ (Realme GT 6) అని.. నోట్‌ సిరీస్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. GT సిరీస్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రియల్‌మి సంస్థ మాత్రం ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే రియల్‌మి నుంచి త్వరలో GT 6 స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ అనేక సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లలో కనిపించింది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ లోనూ కనిపించింది.

realme new smartphone teased

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 పైన పనిచేసే అవకాశం ఉంది. క్వా్ల్‌ కాం స్నాప్‌ డ్రాగన్ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు గరిష్ఠంగా 16GB ర్యామ్‌తో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా రియల్‌మి GT 6 హ్యాండ్‌సెట్ 120W ఛార్జింగ్‌ సపోర్టుతో 5,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఏప్రిల్‌ 11వ తేదీన చైనాలో రియల్‌మి GT నియో 6 SE స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 1.5k LTPO OLED 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS, స్నాప్‌ డ్రాగన్‌ 7+ జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W ఛార్జింగ్‌ సపోర్టుతో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే భారత్‌లో రియల్‌మి విడుదల చేసిన టీజర్‌ ఏ హ్యాండ్‌సెట్‌కు సంబంధించినదో ప్రస్తుతం వెల్లడికానున్నా.. త్వరలోనే వివరాలు వెల్లడైయ్యే అవకాశం ఉంది.

ఇటీవల విడుదలైన రియల్‌మి 12X 5G స్మార్ట్‌ఫోన్‌ 6.72 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 950 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన విజువల్‌ అనుభూతి కలుగుతుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత realme UI 5 పైన పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. గేమింగ్‌ సహా ఇతర సమయాల్లో ఫోన్‌ వేడెక్కినప్పుడు VC కూలింగ్‌ సిస్టమ్‌ ద్వారా హ్యాండ్‌సెట్‌ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP AI ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా 45W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ పూర్తి చేయవచ్చని సంస్థ తెలిపింది. రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 35 గంటల కాలింగ్‌ లేదా 15 గంటలపాటు వీడియో స్ట్రీమింగ్‌ బ్యాకప్‌ను పొందుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme new smartphone teased in india could be Gt 6 series
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X