Home
Mobile

ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి.. అతి తక్కువ ధరకే రియల్‌మీ P3, P3 ప్రో 5G అందుబాటులో!

Realme offer: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా, అయితే ఇదే సరైన సమయం. రియల్‌మీ తన సరికొత్త 'P-కార్నివాల్ సేల్' తో మీ ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా, ఇటీవల విడుదలైన రియల్‌మీ P3, రియల్‌మీ P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తోంది.

ఈ ఆఫర్లు ఏప్రిల్ 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, బ్యాంక్ డిస్కౌంట్లు, ధర తగ్గింపులు వంటి ఆఫర్లతో, ఈ కొత్త రియల్‌మీ ఫోన్లను సొంతం చేసుకోవడానికి ఇది సువర్ణావకాశం.

Realme P-Carnival Sale

* రియల్‌మీ P3 ప్రో 5G
రియల్‌మీ P3 ప్రో 5G (8GB + 128GB వేరియంట్) అసలు ధర రూ.23,999. కానీ ఈ కార్నివాల్ సేల్‌లో, మీరు దీన్ని కేవలం రూ.19,999 కే దక్కించుకోవచ్చు. అంతేకాదు, పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.4,000 వరకు అదనపు డిస్కౌంట్ లేదా బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే ఈ ఫోన్ మీ సొంతమవుతుంది.

నెబ్యులా గ్లో, గెలాక్సీ పర్పుల్, సాటర్న్ బ్రౌన్ వంటి ఆకర్షణీయమైన రంగులలో లభించే ఈ ఫోన్‌లో అద్భుతమైన 6.83-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కంటికి ఇంపుగా ఉంటుంది.

లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో వేగవంతమైన పనితీరును అందిస్తుంది, 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. భారీ 6,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో క్షణాల్లో ఛార్జ్ అవుతుంది. దీనికి IP69 సర్టిఫికేషన్ కూడా ఉంది, అంటే దుమ్ము, ధూళి మాత్రమే కాదు, నీటిలో పడినా తట్టుకోగలదు.

- ఫోటోలు ఇష్టపడే వారి కోసం
ఇది OISతో కూడిన 50MP సోనీ IMX896 ప్రధాన కెమెరా, 2MP సెకండరీ లెన్స్, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6తో వస్తుంది. రియల్‌మీ రెండేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, 3 మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని హామీ ఇస్తోంది.

* రియల్‌మీ P3 5G
ఈ సేల్‌లో రియల్‌మీ P3 5G ధర కూడా తగ్గింది. దీని అసలు ధర రూ.16,999 కాగా, ఇప్పుడు కేవలం రూ.15,999కే లభిస్తోంది. ఇందులో 6.67-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతంగా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే, 50MP ప్రధాన కెమెరా, 2MP పోర్ట్రెయిట్ సెన్సార్, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రో మోడల్ లాగే ఇందులోనూ 6,000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. రియల్‌మీ P3 ఫోన్ స్పేస్ సిల్వర్, నెబ్యులా పింక్, కామెట్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది.

* సేల్ తేదీలు, ఎక్కడ కొనాలి..
రియల్‌మీ P-కార్నివాల్ సేల్ ఏప్రిల్ 22న ప్రారంభమై ఏప్రిల్ 24న ముగుస్తుంది. ఈ కొద్ది రోజుల ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా పొందవచ్చు. తక్కువ బడ్జెట్‌లో టాప్ క్లాస్ ఫీచర్లు కావాలనుకున్నా, లేదా రోజువారీ అవసరాలకు సరిపోయే మంచి ఫోన్ కోసం చూస్తున్నా, రియల్‌మీ P3 సిరీస్‌లో మీకోసం ఓ అద్భుతమైన ఆప్షన్ ఉంది.

ఆలస్యం చేయకండి,ఈ సేల్ త్వరలో ముగిసిపోతుంది. స్టాక్ అయిపోకముందే ఇప్పుడే మీకు నచ్చిన ఫోన్‌ను ఆర్డర్ చేయండి.

Best Mobiles in India

English summary
Realme P-Carnival Sale Live Till April 24: Discounts, Exchange Bonuses and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X