Home
Mobile

6.83 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల రియల్‌మి P3 సిరీస్‌లో భాగంగా నాలుగు ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న P సిరీస్‌ కార్నివల్ సేల్‌లో (Realme P series carnival sale 2025) భాగంగా రియల్‌మి P3 5G, P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ను భారీ డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది.

రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ :
రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme P3 Pro 5G) ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌పై గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Realme P series carnival sale 2025

అయితే 8GB ర్యామ్‌ వేరియంట్స్‌ పైనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ICICI, HDFC, SBI, యాక్సె్స్‌, కోటక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సహా మరిన్ని బ్యాంకు కార్డులపై ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ ను పొందవచ్చు. దీంతోపాటు 3 నెలలపాటు నో కాస్ట్‌ EMI ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌తోపాటు IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు ఈ ప్రో మోడల్‌ గ్లో ఇన్‌ ది డార్క్‌ డిజైన్‌ థీమ్‌ను కలిగి ఉంది. ఈ థీమ్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఈ ప్రో మోడల్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.83 అంగుళాల 1.5k క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని రియల్‌మి వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాలను అమర్చారు. 50MP సోనీ IMX896 OIS కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు ముందువైపు 16MP సోనీ IMX480 సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ AI బెస్ట్ ఫేస్‌, AI రిఫ్లక్షన్‌ రిమూవర్‌, AI మోషన్‌ డీ బ్లర్, AI ఎరేజ్‌ 2.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్‌ :

మరో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ P3 5G హ్యాండ్‌సెట్‌ (Realme P3 5G) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. ప్రస్తుతం రియల్‌మి ప్రత్యేక సేల్‌లో భాగంగా గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

6GB/128GB, 8GB/128GB స్టోరేజీ వేరియంట్స్‌పై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 8GB/256GB స్టోరేజీ వేరియంట్‌ పై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ICICI, HDFC, SBI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి P3 5G ఫోన్‌ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, ProXDR సపోర్టు చేస్తుంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 ను కలిగి ఉంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ రియర్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ IP66 + IP68 + IP69 రేటింగ్‌తో బెస్ట్ వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్‌ :
రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. రియల్‌మి ప్రత్యేక సేల్‌లో భాగంగా SBI, ICICI, HDFC, యాక్సెస్‌, కోటక్‌ బ్యాంకుల కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌, ఎయిర్‌ గెశ్చర్స్‌ను ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్ ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 5.0 ను కలిగి ఉంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ ఫోన్‌ 50MP OmniVision OV50D ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP69 రేటింగ్‌ డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P series carnival sale 2025 offers Rs4000 discount on P3 Pro 5G Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X