రియల్‌మి P సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. ఏ పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది?
Realme P Series smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ రియల్‌మి ఈ సంవత్సరం P3 సిరీస్ తోపాటు P4 సిరీస్ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టీజర్ వెల్లడయింది. దీని ఆధారంగా P సిరీస్ నుంచి కొత్త మోడల్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఏ పేరుతో ఫోన్ ను లాంచ్ చేస్తోందో వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.
ఏ పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది? :
రియల్‌మి P సిరీస్ ఫోన్ గురించి ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే రియల్‌మి P4x పేరుతో ( Realme P4x 5G Smartphone ) ఈ హ్యాండ్‌సెట్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ మార్కెట్ లో రియల్‌మి P3x హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంది.

డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో? :
రియల్‌మి నుంచి P4 5G సిరీస్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చింది. ఈ P4x స్మార్ట్‌ఫోన్.. P3x ఫోన్ కు తర్వాత తరం వెర్షన్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,999 గా ఉంది. ఈ ఫోన్ లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లర్ పింక్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. దీంతోపాటు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ గా ఉంది.
ఆండ్రాయిడ్ 15, 50MP కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది.
6000mAh భారీ బ్యాటరీతో :
ఈ ఫోన్ (Realme P3x 5G Smartphone) 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, Wi-Fi 5, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. రియల్‌మి P3x లైట్ మోడల్ కూడా ఇటీవల అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








