ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్.. రియల్‌మి P1 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!!
రియల్‌మి సంస్థ ఏప్రిల్‌లో P1 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను (Realme P1 5G Series) లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా P1 5G మరియు P1 ప్రో 5G హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సిరీస్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా జూన్ 12 వరకు తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.
రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల సమయంతో పోలిస్తే 23 శాతం తగ్గింపు ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా బేస్ వేరియంట్‌ను రూ.15,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే ప్రో మోడల్ ను విడుదల ధరతో పోలిస్తే 20 శాతం డిస్కౌంట్ ధరతో రూ.19.999 కే సొంతం చేసుకోవచ్చు.

రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్ల వివరాలు....
రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే్ను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్ సహా 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 3D VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 4356.52mm స్టెయిన్‌లెస్ వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఫలితంగా గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లో హ్యాండ్‌సెట్ వేడెక్కకుండా ఉండేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ బేస్ వేరియంట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT600 కెమెరా, 2MP లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
రియల్‌మి P1 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. మరియు 4nm స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీ జతచేయబడింది.
ఈ రెండు హ్యాండ్‌సెట్‌లకు 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ తెలిపింది. 45W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రో మోడల్ కూడా ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్ OIS సపోర్టుతో 50MP సోనీ LYT600 కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








