Home
Mobile

ధర రూ.15,000 సెగ్మెంట్‌లో రియల్‌మి నుంచి కొత్త ఫోన్‌.. 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఏప్రిల్‌ 15న విడుదల..!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఇటీవలే రియల్‌మి 12X 5G స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. త్వరలోనే మరో కొత్త సిరీస్‌ రియల్‌మి P1 5G (Realme P1 5G Series Launch) విడుదల కానుంది. ఈ సిరీస్‌లో రియల్‌మి P1 5G మరియు P1 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌లు ఉండనున్నాయి.

భారత్‌ మార్కెట్‌లో ప్రత్యేకంగా విడుదల : రియల్‌మి P1 5G సిరీస్‌ హ్యాండ్‌ సెట్‌లకు సంబంధించిన కొన్ని ఫీచర్లను సంస్థ వెల్లడించింది. కేవలం భారత్‌ మార్కెట్‌ కోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌లో ఈ రెండు హ్యాండ్‌ సెట్‌లు కనిపిస్తున్నాయి.

Realme P1 5G series Smartphones

ఏప్రిల్‌ 15న భారత్‌ మార్కెట్‌లో విడుదల..
రియల్‌మి P1 5G సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌లు ఏప్రిల్‌ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ.15,000 కంటే తక్కువ ధరకే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే : ఈ ధర సెగ్మెంట్‌లో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే మరియు 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనని రియల్‌మి తెలిపింది. TUV Rhenland eye Protection సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. P1 5G స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెవెన్ లేయర్‌ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

రియల్‌మి P1 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
అదే రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2160 PWM డిమ్మింగ్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైటెనెస్‌ మరియు ProXDR సపోర్టు, TUV సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది.

ప్రో మోడల్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌ సెట్‌ను కలిగి ఉంటుంది. 45W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రియల్‌మి ప్రో మోడల్‌ మెరుగైన ఫీచర్లను కూడా కలిగి ఉండనుంది.

రెయిన్‌ వాటర్‌ టచ్‌ ఫీచర్‌ : టెక్టైల్‌ ఇంజిన్‌ మరియు రెయిన్‌ వాటర్‌ టచ్‌ ఫీచర్‌ సహా మరిన్ని ఫీచర్‌లతో లాంచ్‌ కానుంది. తడి చేతులతో కూడా టచ్‌ పనిచేసేలా ఈ ఫీచర్‌ వినియోగపడుతుంది. విడుదల సమయం మరింత దగ్గర పడే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P1 5G series Smartphones confirmed to launch in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X