Home
Mobile

50MP కెమెరా, 45W ఛార్జింగ్‌ సపోర్టుతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు!

రియల్‌మి సంస్థ తాజాగా భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి P1 5G సిరీస్‌ (Realme P1 5G Series Smartphones) స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి P1 5G, P1 ప్రో 5G హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి దీంతోపాటు రియల్‌మి ప్యాడ్‌ 2 మరియు T110 ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లతో లాంచ్‌ చేసింది.

రియల్‌మి P1 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే మెరుగైన విజువల్‌ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.

Realme P1 5g series smartphones launched in india

ఈ రియల్‌మి P1 5G హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 3D VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 4356.52mm స్టెయిన్‌లెస్‌ వేపర్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఫలితంగా గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ సమయాల్లో హ్యాండ్‌సెట్‌ వేడెక్కకుండా ఉండేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది.

రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT600 కెమెరాను కలిగి ఉంది. మరియు 2MP లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

Realme P1 5g series smartphones launched in india

6GB ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.15999 గా ఉంది. అదే 8GB ర్యామ్ 18,999 గా ఉంది. ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా ముందస్తు బుకింగ్‌ చేసుకొంటే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎర్లీ బర్డ్‌ సేల్‌ జరగనుంది.

రియల్‌మి P1 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 5G చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 3.1 స్టోరేజీ జతచేయబడింది. ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌ ఫోన్‌ను వేడెక్కకుండా పనిచేస్తుంది.

Realme P1 5g series smartphones launched in india

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS పైన పనిచేస్తుంది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ తెలిపింది.

రియల్‌మి P1 5G, P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు 45W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు సింగిల్‌ ఛార్జింగ్‌తో రోజంతా వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్ OIS సపోర్టుతో 50MP సోనీ LYT600 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Realme P1 5g series smartphones launched in india

ప్రో మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.21999గా ఉంది. 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.22,999 గా ఉంది. బ్యాంకు కార్డులపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు. లిమిటెడ్‌ సేల్‌ ఏప్రిల్‌ 22న జరగనుంది. సాధారణ సేల్‌ ఏప్రిల్‌ 30న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అవుతుంది.

Best Mobiles in India

English summary
Realme P1 5g series smartphones launched in india specs price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X