రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజీ వేరియంట్ విడుదల.. సేల్ తేదీ, ఆఫర్ల వివరాలు..!!
రియల్‌మి సంస్థ తాజాగా రియల్‌మి P1 ప్రో స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. భారత్ మార్కెట్‌లో రియల్‌మి P1 సిరీస్‌లో భాగంగా P1 మరియు P1 ప్రో హ్యాండ్‌సెట్‌లు గతంలో లాంచ్ అయ్యాయి. తాజాగా P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను (Realme P1 Pro 5G Smartphone New Variant)విడుదల చేసింది. ఇప్పటికే రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కొత్తగా లాంచ్ చేసిన 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. ఈ కొత్త వేరియంట్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 26 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా.. తొలి సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

దీంతోపాటు Mobikwik ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చని పేర్కొంది. దీంతోపాటు 6 నెలలపాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్ సెట్ మిగిలిన రెండు వేరియంట్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మి P1 ప్రో 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీప్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ మోడల్ ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ రియల్‌మి ప్రో మోడల్ 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 5G ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీ, Adreno 710 GPU తో జతచేయబడి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ తెలిపింది.
ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MPసోనీ LYT600 కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.2 మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు ఎయిర్ గెశ్చర్ ఫీచర్, IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








