రూ.17500 కే 8GB ర్యామ్, 50MP కెమెరా, 6.7 అంగుళాల 5G స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, సేల్ పూర్తి వివరాలు..!
రియల్‌మి సంస్థ భారత్ లో ఏప్రిల్ నెలలో రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ను ఫ్లిప్‌కార్ట్ లో భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.21999 గా ఉంది. ప్రస్తుతం రూ.18,500 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరో రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.17,500 కే రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను (Realme P1 Pro 5G Smartphone) కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీప్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు 45W SuperVooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 OS ను కలిగి ఉంటుంది. 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీ, Adreno 710 GPU తో జతచేయబడి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు పొందుతుందని రియల్‌మి తెలిపింది.
ఈరియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT-600 కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.2, వైఫై 6 మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీ, ఎయిర్ గెశ్చర్స్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది.
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.18,499 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది.
ICICI, యాక్సెస్, HDFC, SBI బ్యాంక్ వంటి ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్ ఫోన్ పేరట్ బ్లూ, Phoenix రెడ్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








