Home
Mobile

రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది.. రూ.2000 డిస్కౌంట్‌ సహా నోకాస్ట్‌ EMI..!

రియల్‌మి నుంచి ఇటీవల P1 సిరీస్ (Realme P1 Pro 5G Sale) భారత్‌ మార్కెట్‌లో విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా P1 మరియు P1 ప్రో లాంచ్‌ అయ్యాయి. గతంలో P1 హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రో మోడల్‌కి మా‌త్రం లిమిటెడ్ సేల్‌ మాత్రమే నిర్వహించారు.

తాజాగా రియల్‌మి P1 ప్రో 5G హ్యాండ్‌సెట్‌ సేల్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయింది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ realme.com మరియు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన ఆఫర్లను ప్రకటన చేసింది.

Realme P1 Pro 5G Smartphone sale offers

రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుతో రూ.2000 డిస్కౌంట్ కూపన్లను పొందవచ్చు. మరియు 9 నెలలపాటు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను పొందవచ్చు. ప్రో మోడల్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.21,999 ఉండగా.. ఆఫర్‌ కారణంగా రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.22,999 గా ఉండగా.. రూ.20,999 కే కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే ద్వారా మెరుగైన విజువల్‌ ‌అనుభూతి కలుగుతుందని సంస్థ చెబుతోంది.

Realme P1 Pro 5G Smartphone sale offers

P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 5G చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 3.1 స్టోరేజీ జతచేయబడింది. ప్రత్యేక 3D వీసీ కూలింగ్ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. మల్టీ టాస్క్ సహా గేమింగ్‌ సమయాల్లో ఫోన్‌ను వేడెక్కకుండా పనిచేస్తుంది. రెయిన్ వాటర్‌ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

ఈ ప్రో మోడల్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS పైన పనిచేస్తుంది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ తెలిపింది.

రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు 45W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు సింగిల్‌ ఛార్జింగ్‌తో రోజంతా వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్ OIS సపోర్టుతో 50MP సోనీ LYT600 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

రియల్‌మి P1 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 3D VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT600 కెమెరాను కలిగి ఉంది. మరియు 2MP లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P1 Pro 5G Smartphone sale is live on realme and flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X