6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక సేల్.. రూ.4000 తగ్గింపు..!!
రియల్‌మి సంస్థ గతనెలలో P1 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. సిరీస్‌లో భాగంగా రియల్‌మి P1 మరియు P1 ప్రో (Realme P1 Pro 5G Smartphone Special sale) హ్యాండ్‌సెట్‌లు భారత్‌లో లాంచ్ అయ్యాయి. గతంలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌లు సేల్ జరిగింది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ మే 21వ తేదీన 12 గంటలపాటు రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక సేల్ నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సేల్ కొనసాగుతుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com మరియు ఫ్లిప్ కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక సేల్‌లో భాగంగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

అదనపు తగ్గింపుతో రూ.17,999కే :
దీంతోపాటు బ్యాంకు ఆఫర్ ద్వారా 128GB స్టోరేజీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ పై రూ.2,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. అదే 256GB స్టోరేజీపై రూ.1,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్ వేరియంట్ ధర రూ.21,999 నుంచి రూ.17,999 కు తగ్గింది. అదే 256GB స్టోరేజీ ఫోన్ ధర 22,999 నుంచి రూ.19,999 కు తగ్గింది.
రియల్‌మి P1 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 4nm స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీ జతచేయబడింది. ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ ఫోన్‌ను వేడెక్కకుండా పనిచేస్తుంది.

3 సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్‌లు :
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS పైన పనిచేస్తుంది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ తెలిపింది.
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
రియల్‌మి P1 5G, P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు 45W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు సింగిల్ ఛార్జింగ్‌తో రోజంతా వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్ OIS సపోర్టుతో 50MP సోనీ LYT600 కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications