Home
Mobile

రియల్‌మి కొత్త 5G ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. 50MP కెమెరా, FHD+ డిస్‌ప్లే, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు...!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి మరో హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. రియల్‌మి P సిరీస్‌ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. రియల్‌మి P1 స్పీడ్‌ 5G పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ (Realme P1 Speed 5G Smartphone) భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇప్పటికే P సిరీస్‌లో P1 సిరీస్‌ సహా P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి అనేక వివరాలు రియల్‌మి వెల్లడించింది. ముఖ్యంగా గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ప్రముఖ ఇ-కామర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్ నిర్వహించనున్నారు. అయితే సేల్‌ తేదీ వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ లో ఈ హ్యాండ్‌సెట్‌ వివరాలు ప్రచురించారు.

Realme P1 Speed 5G Smartphone confirmed to launch on October 15 in india

రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 92.65% స్క్రీన్‌ టూ బాడీ రేషియోతో విడుదల కానుంది. రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 2.8D మైక్రో కర్వ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ పేజీ ఆధారంగా ఈ ఫోన్‌ 26GB LPDDR4x ర్యామ్ (వర్చువల్‌ ర్యామ్‌తో కలిపి) మరియు 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంటుంది. మెరుగైన గేమింగ్‌ అనుభూతి కోసం TUV SUD సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

Realme P1 Speed 5G Smartphone confirmed to launch on October 15 in india

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
మరియు ఈ ఫోన్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా సహా ఇతర కెమెరాల స్పెసిఫికేషన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.

రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ బ్లూటూత్‌ 5.4, వైఫై 6 కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లు సహా IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,000 సెగ్మెంట్‌లో ఉంటుందని తెలుస్తోంది.

* రియల్‌మి P సిరీస్‌లో భాగంగా ఇటీవల P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. AI గేమింగ్‌ ఐ ప్రొటెక్షన్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS, స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT-600 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.21999 గా ఉంది. మిగిలిన రెండు వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.24,999, రూ.27,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P1 Speed 5G Smartphone launch date and key specs and features details revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X