ధర రూ.17,999 కే 50MP కెమెరా, 8GB ర్యామ్, 5000mAh 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్‌లు, సేల్ వివరాలు..!
రియల్‌మి ఇవాళ భారత్ మార్కెట్ P1 స్పీడ్ 5G (Realme P1 Speed 5G Smartphone) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కు ఉపయోగపడేలా స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 50MP AI కెమెరా మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఇండియా, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 92.65 % స్క్రీన్ టూ బాడీ రేషియోతో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్ వివరాలు :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు Mail G615 GPU తో జతచేయబడుతుంది. మరియు 8GB లేదా 12GB LPDDR4x ర్యామ్ మరియు 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజీతో అందుబాటులో ఉంది. అదనంగా 14GB వర్చువల్ ర్యా్మ్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ తో అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కెమెరా స్పెసిఫికేషన్లు :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ f/1.8 అపేచర్‌తో 50MP AI కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా నైట్ మోడ్, పోర్ట్రెయిట్, డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు 2MP కెమెరాను అమర్చారు. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. దీని ద్వారా 1080p రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు.
IP65 రేటింగ్ :
కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 6, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. IP65 రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. స్టీరియో స్పీకర్లు సహా 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బరువు 185 గ్రాములుగా ఉంది.

రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ సేల్ అక్టోబర్ 20వ తేదీ 12 AM నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. అదే 12GB వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది.
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రియల్‌మి P1 స్పీడ్ 5G హ్యాండ్‌సెట్ (Realme P1 Speed 5G Smartphone Sale) రెండు వేరియంట్‌లపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు మూడు నెలల వరకు నోకాస్ట్ EMI సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మరియు Mobikwik ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








