Home
Mobile

ధర రూ.15999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ 5G స్మార్ట్‌ఫోన్‌.. అర్ధరాత్రి నుంచి సేల్‌..!

భారత్‌ మార్కెట్‌లో అక్టోబర్‌ 15న రియల్‌మి నుంచి P1 స్పీడ్‌ స్మార్ట్‌ఫోన్ (Realme P1 Speed 5G Smartphone Sale) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 50MP ఏఐ కెమెరా, 45W ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ అర్ధరాత్రి (అక్టోబర్‌ 20 వ తేదీ 12AM) నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్ ధర సేల్‌ వివరాలు :
రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. 8GB వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. అదే 12GB వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ రెండు వేరియంట్‌లపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.15,999 గా ఉంటుంది.

Realme P1 Speed 5G Smartphone sale

రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ (Realme P1 Speed 5G Specifications) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

కూలింగ్‌ ఛాంబర్ :
రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ Mail G615 GPU, 8GB లేదా 12GB LPDDR4x ర్యామ్‌ మరియు 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజీ జతచేసి ఉంది. 14GB వర్చువల్‌ ర్యా్మ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు VC కూలింగ్‌ ఛాంబర్‌తో అందుబాటులో ఉంది.

50MP +2MP+ 16MP కెమెరాలు :
ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలను అమర్చారు. ఈ కెమెరా అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్‌ వ్యూ వీడియో, నైట్‌ మోడ్‌, పోర్ట్రెయిట్‌ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

ఈ రియల్‌మి P1 స్పీడ్‌ 5G హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP65 రేటింగ్‌తో కూడిన వాటర్‌ మరియు డస్ట్‌ రెసిస్టెంట్‌ గా అందుబాటులో ఉంది. హ్యాండ్‌సెట్‌ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ 5G, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6 ఫీచర్‌లను కలిగి ఉంది. స్టీరియో స్పీకర్లు సహా రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌తో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P1 Speed 5G Smartphone sale to start from today midnight via flipkart full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X