Home
Mobile

12GB ర్యామ్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ Realme స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌...!

రియల్‌మి P1 స్పీడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ (Realme P1 Speed 5G Smartphone) భారత్‌ మార్కెట్‌ లో అక్టోబర్‌ నెలలో విడుదల అయింది. ఈ హ్యాండ్‌ సెట్‌ రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ను ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 50MP కెమెరాతోపాటు, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

రూ.2,000 డిస్కౌంట్‌ :
రియల్‌మి P1 స్పీడ్‌ 5G హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం రెండు వేరియంట్‌లో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ లలో అందుబాటులో ఉంది. 12GB ర్యామ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.20,999 గా ఉంది. అన్ని బ్యాంకు కార్డులపై రూ.2,000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

realme P1 Speed 5G sale

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా గరిష్ఠంగా 5 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ రియల్‌మి P1 స్పీడ్‌ హ్యాండ్‌సెట్ Brushed బ్లూ, టెక్చర్డ్‌ టైటానియం రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ను ప్రత్యేకంగా మల్టీ టాస్కింగ్‌, గేమింగ్‌ కోసం సంస్థ విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ VC కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది.

రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు :
రియల్‌మి స్మార్ట్‌ ఫోన్ 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ VC సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. స్మార్ట్‌ రెయిన్‌ టచ్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది.

realme P1 Speed 5G sale

చిప్‌సెట్‌, ప్రాసెసర్‌ వివరాలు :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. 26GB (ర్యామ్ + వర్చువల్‌ ర్యామ్‌) LPDDR4X, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక కెమెరాలు డ్యూయల్‌ వ్యూ వీడియో, నైట్‌ మోడ్‌, పోర్ట్రెయిట్‌ ఫీచర్‌ లను కలిగి ఉన్నాయి. 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రియల్‌మి P1 స్పీడ్ 5G హ్యాండ్‌ సెట్‌ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ తో అందుబాటులో ఉంది. మరియు IP65 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ ను కలిగి ఉంది. 5G, Wi-Fi 6, బ్లూటూత్‌ 5.4 వంటి కనెక్టింగ్ ఫీచర్‌ లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme P1 Speed 5G topend variant get RS2000 discount on bank cards check details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X