Home
Mobile

ఇవాళ సాయంత్రం రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ తొలి సేల్‌.. రూ.3000 డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి ఇటీవల రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. సూపర్‌ ఫీచర్లతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌లో విడుదల అయింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ ఎర్లీ బడ్‌ సేల్‌ ఇవాళ సాయంత్రం (Realme P2 Pro 5G First Sale) ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు ప్రారంభం అవుతుంది. సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై గరిష్ఠంగా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, సేల్‌ పూర్తి వివరాలు.

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

Realme P2 Pro 5G

ఇవాళ సాయంత్రం 6PM- 8PM మధ్య Early Bird Sale జరగనుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రియల్‌మి ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌లపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అయితే 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్లపై మరో రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ పేరెట్‌ గ్రీన్‌, ఈగల్ గ్రే రంగుల్లో లభిస్తుంది.

డిస్కౌంట్‌ అనంతరం రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర
8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999
12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999
12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.24,999

Realme P2 Pro 5G

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది.

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 OS ను కలిగి ఉంది. VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. IOT రిజర్వ్‌ ఛార్జింగ్‌, AI ఆధారిత ఛార్జింగ్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. 49 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తవుతుందని రియల్‌మి వెల్లడించింది.

రియల్‌మి P2 ప్రో 5G హ్యాండ్‌సెట్‌ కెమెరా విభాగం పరంగా f/1.88 అపేచర్‌. OIS ఫీచర్‌తో 50MP సోనీ LYT-600 కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రా వైడ్‌ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.45 అపేచర్‌తో 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

అయితే ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే AI గేమింగ్‌ ఐ ప్రొటెక్షన్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌, AI పొర్ట్రియిట్‌, AI అల్ట్రా క్లారిటీ, AI గ్రూప్‌ ఫొటో వంటి ఫీచర్లున్నాయి. డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.2. Wi-Fi 6 పైన పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
Realme P2 Pro 5G Smartphone Early Bird Sale to begins today in india via Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X