Home
Mobile

50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే ఫోన్‌పై గరిష్ఠంగా రూ.7000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం రియల్‌మి సంస్థ అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇందులో P3 సిరీస్‌ ఫోన్‌లు కూడా ఉన్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి P3, P3x, P3 ప్రో, P3 అల్ట్రా మోడల్స్‌ ఉన్నాయి. ఈ ఫోన్‌లు బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో బెస్ట్‌ ఫోన్‌లుగా ఉన్నాయి. అయితే గత సంవత్సరం కూడా కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లను రియల్‌మి లాంచ్‌ చేసింది. ఇందులో రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఒకటి. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక బెస్ట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

రియల్‌మి P2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Realme P2 Pro 5G Smartphone) గత సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్‌లో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ రూ.20000 ధర సెగ్మెంట్‌లో బెస్ట్‌ ఫోన్‌లలో ఒకటిగా ఉంది. అయితే ఈ ఫోన్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

realme P2 Pro 5G Smartphone

బేస్‌ వేరియంట్‌పై రూ.4000 తగ్గింపు :
రియల్‌మి P2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.21999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.4 వేలు తగ్గింపును పొందవచ్చు. 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. రూ.5000 తగ్గింపును పొందవచ్చు.

ఏకంగా రూ.7 వేలు తగ్గింపు :
దీంతోపాటు విడుదల సమయంలో 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.27,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.7000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈగల్‌ గ్రే, పేరెట్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ :
రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ గరిష్టంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Realme UI 5.0 OS ను కలిగి ఉంటుంది. థర్మల్‌ మెనేజ్‌మెంట్ కోసం VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

5200mAh బ్యాటరీ :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 2160Hz PWM డిమ్మింగ్‌ ను కలిగి ఉంది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 (OIS) కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ రెయిన్‌ వాటర్‌ టచ్‌ సహా అనేక AI ఫీచర్‌లున్నాయి. డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme P2 Pro 5G Smartphone gets maximum rs7000 price cut on flipkart sale 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X