వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్న రియల్‌మి.. వారం రోజుల్లో రెండు ఫోన్‌లు..!!
రియల్‌మి సంస్థ ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన నార్జో 70 టర్బో 5G హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయనుంది. అనంతరం కొన్నిరోజుల్లోనే మరో హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme P2 Pro 5G) త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రియల్‌మి P1 ప్రో 5G హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది.
తాజాగా రియల్‌మి ఈ కొత్త హ్యాండ్‌సెట్ (Realme Upcoming Smartphone) డిజైన్‌ను విడుదల చేసింది. దీంతోపాటు రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లను కూడా వెల్లడించింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు.

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ సేల్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా షేర్ చేసిన ఫోటో ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ గ్రీన్ కలర్‌లో గోల్డ్ రంగు ఫ్రేమ్‌తో ఉంది.
దీంతోపాటు ఈ టీజర్ ఇమేజ్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యుల్ ఆకర్షణీయంగా ఉంది. మరియు గోల్డ్ బోర్డర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు LED ను కూడా అమర్చారు. కర్వడ్ డిస్‌ప్లే, స్లిమ్ బెజెల్స్ మరియు సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది.
రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. అయితే చిప్‌సెట్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. 5 నిమిషాల పాటు ఛార్జింగ్ చేయడం ద్వారా గంటపాటు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిగిలిన వివరాలు సెప్టెంబర్ 10 న విడుదల కానున్నాయి.
భారత్ మార్కెట్‌లో సెప్టెంబర్ 9న రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన డిజైన్ సహా కొన్ని స్పెసిఫికేషన్‌లు ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 7.6mm థిక్‌నెస్, 185 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. దీంతోపాటు లీకైన వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు నాలుగు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు రియల్‌మి బడ్స్ N1 TWS బడ్స్ కూడా విడుదల కానున్నాయి. ఈ బడ్స్ సింగిల్ ఛార్జింగ్‌తో 40 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని రియల్‌మి తెలిపింది. 12.4mm బాస్ డ్రైవర్లను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్ 360 డిగ్రీల స్పేషియల్ ఆడియో ఫీచర్లను కలిగి ఉంది. 46dB వరకు హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ పైన పనిచేస్తాయి.


Click it and Unblock the Notifications








