Home
Mobile

50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో రియల్‌మి ఫోన్‌ విడుదల.. రూ.3000 డిస్కౌంట్‌..!

రియల్‌మి నుంచి ఇవాళ రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme P2 Pro 5G Smartphone Launched) విడుదల అయింది. రియల్‌మి P1 Pro 5G హ్యాండ్‌సెట్‌ తర్వాత తరం వెర్షన్‌గా P2 మోడల్‌ లాంచ్‌ అయింది. కర్వడ్‌ డిస్‌ప్లే సహా ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ తేదీలు సహా బ్యాంకు ఆఫర్ల వివరాలను రియల్‌మి వెల్లడించింది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

రియల్‌మి P2 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్‌తో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే AI గేమింగ్‌ ఐ ప్రొటెక్షన్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

Realme P2 Pro 5G Smartphone

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు గరిష్ఠంగా 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో వర్చువల్‌ ర్యామ్‌ సదుపాయం కూడా ఉంది. మరియు VC కూలింగ్‌ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి హ్యాండ్‌సెట్ f/1.88 అపేచర్‌. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP సోనీ LYT-600 కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.45 అపేచర్‌తో 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

Realme P2 Pro 5G Smartphone

ఈ రియల్‌మి P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ IOT రిజర్వ్‌ ఛార్జింగ్‌ మరియు ఇతర AI ఆధారిత ఛార్జింగ్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.2. Wi-Fi 6 పైన పనిచేస్తుంది.

\రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పేరెట్‌ గ్రీన్‌, ఈగల్ గ్రే రంగుల్లో లభిస్తుంది.

Realme P2 Pro 5G Smartphone

ఈ హ్యాండ్‌సెట్ ఎర్లీ బర్డ్‌ సేల్‌ సెప్టెంబర్ 17 సాయంత్రం 6PM - 8PM మధ్య నిర్వహించనున్నారు. మూడు స్టోరేజీ వేరియంట్‌లపై రూ.2000 చొప్పున డిస్కౌంట్‌లను పొందవచ్చు. అదే విధంగా 12GB ర్యామ్ వేరియంట్లపై రియల్‌మి అదనంగా రూ.1000 డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ నిర్వహించనున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P2 Pro 5G Smartphone launched in india with 80W Charging support and Snapdragon 7s Gen 2 Chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X