Home
Mobile

5200mAh బ్యాటరీ, AI ఫీచర్‌లు, 6.7 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై గరిష్ఠంగా రూ.3000 తగ్గింపు..!

రియల్‌మి నుంచి ఇటీవల రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవల విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎర్లీ బడ్‌ సేల్‌ సెప్టెంబర్‌ 17 న నిర్వహించగా.. ఇవాళ మరోసారి కొనుగోలుకు (Realme P2 Pro 5G Smartphone Sale) అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ కొనుగోలుపై గరిష్ఠంగా రూ.3000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5200mAh బ్యాటరీ సహా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈగల్‌ గ్రే, పేరెట్‌ గ్రీన్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Realme P2 Pro 5G Smartphone sale is live on flipkart

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్లపై కూపన్‌ కోడ్ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. మరియు 12GB ర్యామ్ వేరియంట్‌లలో అదనంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ధరలు వరుసగా రూ.19,999, రూ.21,999, రూ.24,999 గా ఉండనున్నాయి.

రియల్‌మి P2 ప్రో 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. AI గేమింగ్‌ ఐ ప్రొటెక్షన్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.

Realme P2 Pro 5G Smartphone sale is live on flipkart

రియల్‌మి P2 ప్రో 5G హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.88 అపేచర్‌తో 50MP సోనీ LYT-600 కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ f/2.45 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం 49 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ సహా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత AI అల్ట్రా క్లారిటీ, AI పొర్ట్రెయిట్‌, AI గ్రూప్‌ ఫొటో ఫీచర్లు ఉన్నాయి.

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. మరియు మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P2 Pro 5G Smartphone sale is live on flipkart specs features sale discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X