6000mAh బ్యాటరీ. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్.. మార్చి 19న విడుదల..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి గత నెలలో రియల్‌మి P3 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. P3x 5G స్మార్ట్‌ఫోన్, P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యాయి. మరో రెండు రోజుల్లో (మార్చి 19) రియల్‌మి P3 5G, రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.
తాజాగా రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాలు ఆధారంగా ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు AnTuTU స్కోర్ 750000 పాయింట్స్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6050mm2 వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా టచ్ కంట్రోల్ , GT బూస్ట్, AI మోషన్ కంట్రోల్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్ మార్చి 19 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లతో అందుబాటులో ఉంటుంది. బ్యాంకు కార్డులతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ నెబులా పింక్, కామెట్ గ్రే,, స్పే్స్ సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుందని రియల్‌మి తెలిపింది.
రియల్‌మి P3 అల్ట్రా హ్యాండ్‌సెట్ 1.5K క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు కాస్మిక్ స్టార్ రింగ్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ LPDDR5X ర్యామ్‌తో జతచేసి ఉంటుంది. VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX896 OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ కూడా మార్చి 19 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.
రియల్‌మి P3 సిరీస్‌లో ఇప్పటికే ప్రో, P3x 5G మోడళ్లు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. 50MP + 2MP + 8MP (సెల్ఫీ) కెమెరాలను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 6GB/128GB వేరియంట్ ధర రూ.13,999, 8GB/128GB ధర రూ.14,999 గా ఉంది.
రియల్‌మి P3 ప్రో 5G ఫోన్ 6.83 అంగుళాల 1.5k క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 50MP + 2MP+ 16MP (సెల్ఫీ) కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.21999 గా ఉంది.


Click it and Unblock the Notifications








