Home
Mobile

రూ.15999 ధరకు 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌ 5G స్మార్ట్‌ఫోన్!

రియల్‌మి భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల GT 8 ప్రో, C85 ఫోన్‌లను లాంచ్‌ చేసింది. డిసెంబర్‌ 4 వ తేదీన రియల్‌మి p4x 5G ఫోన్‌ విడుదల కానుంది. ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి p3 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

విడుదల సమయంలో రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

Realme P3 5G smartphone

రూ.15999 ప్రారంభ ధరతో :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధరలు రూ.15999, రూ.16999, రూ.18499 గా ఉన్నాయి. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్పేస్ సిల్వర్‌, కామెట్‌ గ్రే, నెబులా పింక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 1500Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు AI Eye ప్రొటెక్షన్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ డిస్‌ప్లే ProXDR సపోర్టు ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. బ్యాటరీ, ఛార్జింగ్‌ పరంగా 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 పైన పనిచేస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని రియల్‌మి తెలిపింది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్‌లు ఉన్నాయి. దీంతోపాటు ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ AI Best Face, Live Photo, AI Snap Mode వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏరో స్పేస్‌ కూలింగ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. గేమింగ్ కోసం GT బూస్ట్‌, 90fps BGMI ను సపోర్టు చేస్తుందని రియల్‌మి తెలిపింది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P3 5G smartphone with 6000mAh Battery, 50MP Camera available at Rs15999 flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X