బడ్జెట్ ధరలో 6000mAh బ్యాటరీ, FHD+ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్!
భారత్ మార్కెట్‌లో రియల్ 16 ప్రో సిరీస్ జనవరి 6 వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో భాగంగా రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ సిరీస్‌కు సంబంధించిన డిజైన్ సహా కెమెరా వివరాలు వెల్లడయ్యాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. అయితే గత సంవత్సరం రియల్‌మి P3, P4 సిరీస్‌లో భాగంగా అనేక మోడల్స్ విడుదల అయ్యాయి. ప్రస్తుతం రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫుల్ HD+ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3 5G Smartphone) విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.15999, రూ.16999, రూ.18499 గా ఉంది.

మూడు కలర్ వేరియంట్స్ :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఈ రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ నెబులా పింక్, స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే, కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. AI Eye ప్రొటెక్షన్, ProXDR సపోర్టును కలిగి ఉంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ రియల్‌మి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ ఏరో స్పేస్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ AI Snap Mode, AI Best Face, Live Photo వంటి ఫీచర్‌లు ఉన్నాయి.
6000mAh బ్యాటరీ :
రియల్‌మి P3 స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ గేమింగ్ కోసం GT బూస్ట్, 90fps తో BGMI ను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








