6000mAh బ్యాటరీ, 3 సంవత్సరాల అప్‌డేట్స్, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, వాటర్ రెసిస్టెంట్ ఫోన్ పై డిస్కౌంట్..!
రియల్‌మి P3 సిరీస్ లో భాగంగా P3 5G, P3x 5G, P3 ప్రో, రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ లో ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫుల్ HD+ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ :
రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3 5G Smartphone) విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

డిస్కౌంట్ ధరలు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 6GB/128GB ధర రూ.15999, 8GB/128GB ధర రూ.16999, 8GB/256GB ధర రూ.18499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై క్యాష్‌బ్యాక్ ను అందిస్తోంది. ఈ ఫోన్ కామెట్ గ్రే, నెబులా పింక్, స్పేస్ సిల్వర్ కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఫుల్ HD+ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్‌ను కలిగి ఉంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. లైవ్ ఫోటో, AI బెస్ట్ ఫేస్, AI Snap Mode వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
IP66, IP68, IP69 రేటింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఏరో స్పేస్ కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. GT బూస్ట్, 90FPS BGMI ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే ProXDR సపోర్టును కలిగి ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్ తో బెస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications