Home
Mobile

రూ.12 వేల ధరలో మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌!

రియల్‌మి 16 ప్రో సిరీస్‌ భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 200MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ సిరీస్‌ ప్రత్యేక డిజైన్‌ ను కలిగి ఉంది. రియల్‌మి నుంచి ఇటీవల కీలక ప్రకటన వెలువడింది. ఏకంగా 10,001mAh బ్యాటరీతో రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేస్తామని తెలిపింది. జనవరి 29 వ తేదీన విడుదల కానుంది.

రియల్‌మి P3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ :
గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో రియల్‌మి P3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Realme P3 lite 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మిలిటరీ గ్రేడ్‌ షాక్ రిసిస్టెంట్‌ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 32MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Realme P3 lIte 5G smartphone

ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart Republic Day Sale 2026) అందుబాటులోకి ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్‌ డే సేల్‌ 2026 లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

HD+ డిస్‌ప్లే :
రియల్‌మి P3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్ టచ్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. పర్పుల్‌ బ్లూసమ్‌, మిడ్‌నైట్‌ లిలీ, లిలీ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులోకి ఉంది.

6000mAh బ్యాటరీ, 32MP కెమెరా :
ఈ రియల్‌మి ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్, 5W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా ఫోన్ వెనుక వైపు 32MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.

ఆర్మర్‌ షెల్‌ టఫ్‌ బిల్ట్ :
రియల్‌మి P3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ AI Clear Face, AI Smart Loop ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ ఆర్మర్‌ షెల్‌ టఫ్‌ బిల్ట్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ షాక్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. 2 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్‌ కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం త‌క్కువగా ఉంటుందని రియల్‌మి చెబుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P3 lIte 5G smartphone gets best deal on flipkart republic day sale 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X