Home
Mobile

బడ్జెట్‌ ధరలో 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ రెసిస్టెంట్స్‌, IP64 రేటింగ్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల P4 సిరీస్‌ ను లాంచ్‌ చేసింది. అయితే ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి P3 సిరీస్‌ ను లాంచ్ చేసింది. P3 సిరీస్‌ లో ఏకంగా నాలుగు మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. అయితే రియల్‌మి P3 లైట్ 5G (Realme P3 lite 5G Smartphone) పేరుతో మరో ఫోన్‌ విడుదల కానుంది. ఈ ఫోన్‌ కు సంబంధించి అనేక వివరాలు వెల్లడయ్యాయి.

విడుదల తేదీ :
భారత్‌ మార్కెట్‌ లో రియల్‌మి P3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ 13 వ తేదీన లాంచ్ కానుంది. అయితే రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా సేల్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌ ను కలిగి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వెల్లడయింది.

realme P3 lite 5G

120Hz రీఫ్రెష్‌ రేట్ :
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా రియల్‌మి P3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 7.94mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. మరియు 197 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

చిప్‌సెట్‌, ఏఐ ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB. 6GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ గూగుల్‌ జెమిని AI, రియల్‌మి ఏఐ స్మార్ట్‌ లూప్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

realme P3 lite 5G

32MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 32MP కెమెరాను కలిగి ఉంటుంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో విడుదల కానుంది.

మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ :
రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంటుంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ 3.5mm ఆడియో జాక్‌ ను కూడా కలిగి ఉంటుంది.

రియల్‌మి P3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఫోన్‌ మిడ్‌నైట్‌ లిల్లీ, పర్పుల్‌ బ్లూసమ్, లిల్లీ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
realme P3 lite 5G smartphone launch date and features revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X