రూ.10499 కే 2 మీటర్ల నుంచి పడినా డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్.. 6000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్!
Realme P3 lite 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి భారత్ మార్కెట్‌లో రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి P3 సిరీస్ విడుదల కాగా.. తాజాగా లైట్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో ఈ హ్యాండ్‌సెట్ విడుదల అయింది.
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ ఆర్మర్ షెల్ టఫ్ బిల్ట్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఫలితంగా 2 మీటర్ల నుంచి ఫోన్ కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతోంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ (1604 x 720 పిక్సల్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.
6000mAh బ్యాటరీ, 5W రివర్స్ ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 5 నిమిషాలు ఛార్జింగ్ చేసి, 4.8 గంటలపాటు కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని రియల్‌మి తెలిపింది. ఈ ఫోన్‌ను సింగిల్ ఛార్జింగ్ పై 18 ఇన్‌స్టాగ్రామ్ వినియోగం లేదా 14 గంటల యూట్యూబ్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

కెమెరా విభాగం పరంగా ఫోన్ వెనుక వైపు 32MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ AI Clear Face, AI Smart Loop వంటి AI ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 7.94mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు రియల్‌మి తెలిపింది.
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ సేల్ సెప్టెంబర్ 22, 12AM గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లిలీ వైట్, పర్పుల్ బ్లూసమ్, మిడ్‌నైడ్ లిలీ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








