కిందపడినా డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్ సేల్ రేపటి నుంచే.. 6000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్..!
రియల్‌మి ఇండియా నుంచి ఇటీవల రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3 Lite 5G Smartphone Sale) విడుదల అయింది. ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి P3 సిరీస్ (Realme P3 Series) లాంచ్ కాగా.. తాజాగా లైట్ వెర్షన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.1000 డిస్కౌంట్ :
భారత్ మార్కెట్ లో రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ సెల్ సెప్టెంబర్ 22వ తేదీ 12AM కు ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉంది. అయితే తొలి సేల్ లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

మూడు కలర్ వేరియంట్స్ :
దీంతో ఈ హ్యాండ్‌సెట్ ధరలు రూ.9499, రూ.10499 గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పర్పుల్ బ్లూసమ్, లిలీ వైట్, మిడ్‌నైడ్ లిలీ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ను సింగిల్ ఛార్జింగ్ పై 18 గంటలపాటు ఇన్‌స్టాగ్రామ్ లేదా 14 గంటల వరకు యూట్యూబ్ ను వినియోగించుకోవచ్చు.
కిందపడిన డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్..! :
కెమెరా విభాగం పరంగా 32MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI Smart Loop, AI Clear Face ఫీచర్లున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆర్మర్ షెల్ టఫ్ బిల్ట్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ లను కలిగి ఉంది. అందువల్ల 2 మీటర్ల నుంచి ఫోన్ కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయని రియల్‌మి తెలిపింది.


Click it and Unblock the Notifications