రూ.10499 ధరకు 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
Realme P3 Lite 5G Smartphone : రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్ లో ఈ సంవత్సరం అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. ఇందులో P3, P4 సిరీస్‌లతోపాటు 15 సిరీస్ మోడల్స్ కూడా ఉన్నాయి. P3 సిరీస్ నుంచి అనేక మోడల్స్ వచ్చాయి. ఈ సంవత్సరం తొలి భాగంలో లాంచ్ అయిన రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం సుమారు రూ.10 వేల ధర వేరియంట్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది.
రూ.10499 ధరకే 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు.

కిందపడినా డ్యామేజీ కాకుండా ఉండేలా ప్రత్యేక ఫీచర్లు :
ఈ రియల్‌మి ఫోన్ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, ఆర్మర్ షెల్ టఫ్ బిల్ట్ ఫీచర్ లు ఉన్నాయి. ఫలితంగా ఫోన్ పొరపాటున కిందపడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది. దీంతోపాటు IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ను కలిగి ఉంది. తడి చేతులతోనూ ఈ హ్యాండ్‌సెట్ ను వినియోగించుకోవచ్చు.
32MP కెమెరా, AI ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 32MP కెమెరా, ముందువైపు 8MP కెమెరా ఉంది. అయితే ఈ ఫోన్ కెమెరాలు అనేక ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి. ఈ జాబితాలో AI Clear Face, AI Smart Loop వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 15 OS, 6000mAh బ్యాటరీ :
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
* రియల్‌మి P సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇటీవలే ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఏ పేరుతో లాంచ్ కానుందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications






