రూ.11999 ధరకు కిందపడినా డ్యామేజీ కాని ఫోన్.. 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే సహా..!
రియల్‌మి సంస్థ గత సంవత్సరం P3, P4 సిరీస్ నుంచి అనేక స్మార్ట్‌ఫోన్ లను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం కూడా P4 సిరీస్ నుంచి భారీ డిస్‌ప్లేతో P4 పవర్ 5G ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 200MP కెమెరాలతో రియల్‌మి 16 ప్రో సిరీస్ కూడా విడుదల అయింది. అయితే రూ.12 వేల ధరలో 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన ఫోన్ మీరు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
భారత్ లో లాంచ్ అయిన రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3 Lite 5G Smartphone) బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా.. అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ ఆర్మర్ షెల్ టఫ్ బిల్డ్ ప్రొటెక్షన్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

కిందపడినా డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్! :
ఫలితంగా 2 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్ కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని రియల్‌మి తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ లిలీ, పర్పుల్ బ్లూసమ్, లిలీ వైట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది.
రూ.11999 ప్రారంభ ధరతో :
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart) అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు.

రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు.
6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 5W ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 32MP కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ AI Clear Face, AI Smart Loop వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








