రూ.21999 ధర కే 6000mAh బ్యాటరీ, 6.83 అంగుళాల క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్!
రియల్‌మి ఇవాళ భారత్ మార్కెట్లో రియల్‌మి P3 సిరీస్ లో (Realme P3 Series) లాంచ్ అయింది. ఇందులో భాగంగా రియల్‌మి P3 ప్రో, రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. P3x మోడల్‌ను రూ.15000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. అదే ప్రో మోడల్ రూ.25000 కంటే తక్కువ ధరలో విడుదల అయింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉన్నాయి. ప్రో మోడల్ (Realme P3 Pro 5G Launched)స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ ప్రో మోడల్ సరికొత్త గ్లో ఇన్ ది డార్క్ డిజైన్ థీమ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.83 అంగుళాల 1.5k (1472*2800 పిక్సల్స్) క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీతో విడుదల అయింది.

ఈ ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
ఈ ఫోన్ AI బెస్ట్ ఫేస్, AI మోషన్ డీబ్లర్, AI రిఫ్లక్షన్ రిమూవర్, AI ఎరేజ్ 2.0 వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX896 కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 16MP సోనీ IMX480 సెన్సార్‌ను కలిగి ఉంది.
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ :
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G VoLTE, బ్లూటూత్, వైపై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్‌తోపాటు IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3 Pro 5G Smartphone Sale) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఫిబ్రవరి 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ప్రారంభ ధర రూ.21999 గా ఉంటుంది. ఈ ఫోన్ శాటర్న్ బ్రౌన్, నెబులా గ్లో, గెలాక్సీ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








