ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 డిస్కౌంట్.. 6.83 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా!
రియల్‌మి ఈ సంవత్సరం భారత్ మార్కెట్‌లో ఇతర మోడల్స్‌తోపాటు రియల్‌మి P3, P4 సిరీస్‌ను లాంచ్ చేసింది. P3 సిరీస్‌లో ఈ సంవత్సరం తొలిభాగంలో లాంచ్ అయింది. అదే P4 సిరీస్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. అయితే రియల్‌మి P3 సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గ్లో ఇన్ డార్క్ థీమ్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3 Pro 5G Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.6000 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart Big Bang Diwali Sale 2025) ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17999 గా ఉంది. అంటే రూ.6 వేల డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అదే ఇతర వేరియంట్స్ ధరలు రూ.18999, రూ.20999 గా ఉంది. అంటే ఈ రెండు వేరియంట్స్ కూడా రూ.6000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ పర్పుల్, నెబులా గ్లో, శాటర్న్ బ్రౌన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
భారీ డిస్‌ప్లే :
రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5k క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో 50MP సోనీ IMX896 కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సోనీ IMX480 కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ AI Best Face, AI మోషన్ డీబ్లర్, AI Erase 2.0. AI Reflection Remover వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
6000mAh భారీ బ్యాటరీ :
రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, WiFi, బ్లూటూత్, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








