డిస్‌ప్లే కోసమైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.. రూ.2000 డిస్కౌంట్‌తో ఇవాళ్టి నుంచే సేల్..!
భారత్ మార్కెట్‌లోకి ఫిబ్రవరి 18 వ తేదీన రియల్‌మి P3 5G సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్ లో భాగంగా రియల్‌మి P3 ప్రో 5G, P3x 5G స్మార్ట్‌ఫోన్ లు లాంచ్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో P3 ప్రో 5G ఫోన్ (Realme P3 Pro 5G Sale) ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో భాగంగా రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ప్రో మోడల్ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
తొలి సేల్.. రూ.2000 డిస్కౌంట్ :
రియల్‌మి P3 ప్రో 5G హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. తొలిసేల్‌లో భాగంగా అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

ఈ వెబ్‌సైట్లో కొనుగోలు చేయవచ్చు :
ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.21,999 గా ఉంటుంది. మరియు ఇతర వేరియంట్‌ల ధరలు రూ.22,999, రూ.24,999 గా ఉంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గెలాక్సీ పర్పుల్, నెబులా గ్లో, శాటర్న్ బ్రౌన్ వంటి మూడు రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మి P3 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ రియల్‌మి ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5k క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను అమర్చారు.
భారీ బ్యాటరీ, AI ఫీచర్‌లు :
ఈ ఫోన్ AI బెస్ట్ ఫేస్, AI Reflection Remover, AI మోషన్ డీబ్లర్, AI Erase 2.0 వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఫలితంగా ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించేవారికి అనుకూలంగా ఉంటుంది.
ఈ ఫోన్ గ్లో ఇన్ ది డార్క్ డిజైన్ థీమ్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, Wi-Fi 5, GPS, USB-C ఛార్జింగ్ పోర్టుతో అందుబాటులో ఉంది. ఈ ప్రో మోడల్ IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
మరో ఫోన్ :
ఈ సిరీస్‌లో భాగంగా విడుదల అయిన బడ్జెట్ రేంజ్ 5G ఫోన్ రియల్‌మి P3X 5G సేల్ ఈ నెల 28 నుంచి ప్రారంభ కానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13999 ఉండగా.. తొలిసేల్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.12999 గా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








