రియల్‌మీ P3 ప్రో.. రాత్రిపూట మెరిసే కొత్త ఫోన్.. టెక్నాలజీతో అదరగొట్టేస్తుంది.. త్వరలోనే లాంచ్..!!
Realme P3 Pro: రియల్‌మీ సంస్థ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ P3 ప్రో 5Gని ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇది చీకట్లో వెలిగిపోయే డిజైన్‌తో వస్తోంది. ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో మరే ఫోన్‌కీ లేదు. అంతేకాదు, ఇందులో పవర్‌ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, ఇంకా అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
* పర్ఫార్మెన్స్ విషయానికొస్తే..
రియల్‌మీ P3 ప్రో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇది చాలా స్మూత్‌గా, ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. హెవీ గేమ్స్, భారీ యాప్స్‌ను సైతం ఈ ప్రాసెసర్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్ రేట్స్ కూడా స్టెడీగా ఉంటాయని రియల్‌మీ చెబుతోంది.

* కూలింగ్ సిస్టమ్
ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి, ఇందులో 6,050mm² వేపర్ కూలింగ్ ఛాంబర్‌ని ఇచ్చారు. ఎంతసేపు గేమ్స్ ఆడినా, ఫుల్లుగా వాడినా ఫోన్ వేడెక్కకుండా ఈ కూలింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. ఫోన్ హీట్ ఎక్కిన వెంటనే ఈ సిస్టమ్ చల్లబరుస్తుంది, మీ ఫోన్ ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది.
* డిజైన్ & డ్యూరబిలిటీ
రియల్‌మీ P3 ప్రో కోసం సరికొత్త డిజైన్‌ని తీసుకొచ్చారు. ఫోన్ వెనుక ప్యానెల్ "నెబ్యులా పాటర్న్స్" తో చాలా కొత్తగా, చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఫోన్ మందం కూడా చాలా తక్కువే, కేవలం 7.99mm మాత్రమే. సన్నగా, స్టైలిష్‌గా ఉండటమే కాదు, చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది.
డ్యూరబిలిటీ గురించి చెప్పాలంటే, రియల్‌మీ P3 ప్రోకి ట్రిపుల్ IP రేటింగ్ ఉంది, అవి IP69, IP68, ఇంకా IP66. అంటే దుమ్ము, నీళ్లు ఏవీ దీని దరిదాపుల్లోకి కూడా రావు. చాలా స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్‌కి డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ. పడగొట్టినా గీతలు పడవు, అంత స్ట్రాంగ్‌గా ఉంటుందంట.
* చీకట్లో వెలిగిపోయే ఫీచర్
రియల్‌మీ P3 ప్రోలో హైలైట్ ఫీచర్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా దీని గ్లో-ఇన్-ది-డార్క్ బ్యాక్ ప్యానెల్. ఈ ఫోన్ రెండు కలర్స్‌లో వస్తుంది. ఒకటి ల్యూమినస్ లైట్ బ్లూ, రెండు పర్పుల్. పర్పుల్ కలర్ వేరియంట్ వెనుక వైపు వెగన్ లెదర్‌తో వస్తుంది, ఇది చూడటానికి చాలా డిఫరెంట్ టెక్స్‌చర్‌తో ఉంటుంది.
రియల్‌మీ 14 ప్రోలో టెంపరేచర్ సెన్సిటివ్ కలర్-చేంజింగ్ టెక్నాలజీ ఉండేది. కానీ P3 ప్రో మాత్రం ల్యూమినస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తోంది. అంటే ఇది చీకట్లో నెబ్యులా పాటర్న్ లా మెరిసిపోతుంది. రాత్రిపూట ఫోన్ వెలిగిపోతుంటే చూడటానికి ఎంత బాగుంటుందో ఊహించుకోండి.
* బ్యాటరీ & ఛార్జింగ్
రియల్‌మీ P3 ప్రోలో ఏకంగా 6,000mAh బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు. డెలివరీ బాయ్స్‌కి ఇది బాగా సెట్ అవుతుంది అంతేకాదు మొబైల్‌లోనే వర్క్ చేసే వారికి కూడా ఈ బ్యాటరీ బ్యాకప్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఛార్జింగ్ చాలా స్పీడ్‌గా ఎక్కుతుంది.
పవర్‌ఫుల్ ప్రాసెసర్, అదిరిపోయే డిజైన్, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ.. ఇన్ని ఫీచర్లతో రియల్‌మీ P3 ప్రో గేమింగ్ లవర్స్‌కి, స్మార్ట్‌ఫోన్ పిక్స్‌కి బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఐదు రోజుల్లోనే ఇది లాంచ్ కానుండగా దీనిపై భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. మరి ఇది ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications








