6000mAh బ్యాటరీ. 6.83 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా 5G ఫోన్ సేల్.. రూ.3000 డిస్కౌంట్!
రియల్‌మి నుంచి ఇటీవల P3 సిరీస్ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇందులో భాగంగా రియల్‌మి P3 5G, P3 అల్ట్రా 5G మోడల్స్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో P3x 5G, P3 ప్రో ఫోన్‌లున్నాయి. ఇవాళ్టి నుంచి రియల్‌మి P3 అల్ట్రా ఫోన్ సేల్ (Realme P3 Ultra 5G Smartphone Sale) ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
అల్ట్రా ఫోన్ ధర వివరాలు :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.

రూ.3000 డిస్కౌంట్ :
రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఎక్స్ఛేంజీ బోనస్ రూ.1000 పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 7.38mm స్లిమ్ డిజైన్‌తో 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ నెప్ట్యూన్ బ్లూ, ఓరియన్ రెడ్ వేరియంట్స్‌లో లభిస్తుంది. మరియు లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గ్లోయింగ్ లూనార్ డిజైన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే చీకట్లు ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ మెరుస్తుంది.

మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ అల్ట్రా వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ AnTuTu స్కోర్ 1,450,000 ను కలిగి ఉంది.
AI ఫీచర్లు :
ఈ ఫోన్ మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6050mm2 ఏరోస్పేస్ గ్రేడ్ VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ AI మోషన్ కంట్రోల్, AI అల్ట్రా టచ్ కంట్రోల్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత GT బూస్ట్ గేమింగ్ ఫీచర్లను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చు.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాలను అమర్చారు.
ఈ అల్ట్రా మోడల్ హ్యాండ్‌సెట్ 80W AI బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP66+ IP68+ IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.4, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








