6.83 అంగుళాల భారీ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్!
Realme P3 Ultra 5G Smartphone : రియల్‌మి భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం తొలి భాగంలో P3 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా అనేక మోడల్స్ అందుబాటులోకి వచ్చింది. ఈ సంవత్సరం రెండో భాగంలో P4 సిరీస్ లాంచ్ అయింది. P3 సిరీస్‌లో భాగంలో లాంచ్ అయిన రియల్‌మి P3 అల్ట్రా 5G మోడల్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్ తక్కువ ధరకు అందుబాటులోకి రాగా.. తాజాగా మరింత డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది.
విడుదల సమయంలో రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.27,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉండేది.

రూ.8 వేల డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ హ్యాండ్‌సెట్‌ను భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ 8GB/128GB, 8GB/256GB ధరలు రూ.8 వేల డిస్కౌంట్‌తో ధర రూ.18,999, రూ.19,999 గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ రూ.6 వేల డిస్కౌంట్‌తో రూ.24,999 కే అందుబాటులో ఉంది.
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ గ్లోయింగ్ లూనార్ డిజైన్ టెక్నాలజీని కలిగి ఉంది. అంటే చీకట్లో ఈ ఫోన్ వెనుక వైపు ఉన్న ప్యానల్ మెరుస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 7.38 అంగుళాల స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లోయింగ్ లూనార్ వైట్, నెప్య్టూన్ బ్లూ, ఓరియన్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.
భారీ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేతో :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ హ్యాండ్‌సెట్‌ను వినియోగించుకోవచ్చు.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6050mm Sq ఏరోస్పేస్ గ్రేడ్ VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గేమింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత GT బూస్ట్ గేమింగ్ ఫీచర్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను అమర్చి ఉంది. ముందు వైపు 16MP కెమెరాను కలిగి ఉంది.
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ IP66 + IP68 + IP69 రేటింగ్‌తో రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








