రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి మరో కొత్త ఫోన్.. విడుదల వివరాలు సహా కీలక సమాచారం లీక్..!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల కాలంలో P సిరీస్ స్మార్ట్‌ఫోన్ లను విడుదల చేస్తోంది. ఇప్పటికే P సిరీస్‌లో రియల్‌మి P1, P1 ప్రో, P2 ప్రో విడుదల కాగా.. ఇటీవల రియల్‌మి P1 స్పీడ్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే కొన్ని నివేదికల ఆధారంగా త్వరలో భారత్ మార్కెట్‌లో రియల్‌మి P3 అల్ట్రా హ్యాండ్‌సెట్ (Realme P3 Ultra Smartphone) విడుదల కానుందని తెలుస్తోంది. ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ను సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. అయితే భారత్ మార్కెట్‌లోకి రియల్‌మి నుంచి రేపు మరో బడ్జెట్ రేంజ్ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది.
గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీ :
91మొబైల్స్ నివేదిక ఆధారంగా రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ (Realme P Series Smartphone) RMX5030 మోడల్ నంబర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ తో జతచేసి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ వెనుక వైపు గ్లాస్ ప్యానల్ ను కలిగి ఉంది.

ఎప్పుడు విడుదల కానుందంటే ? :
రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ గ్రే కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. గత మోడల్ తో పోలిస్తే మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ మార్కెట్ లో ఈ అల్ట్రా హ్యాండ్‌సెట్ 2025 జనవరి నెల చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రియల్‌మి P2 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరా ను కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
భారత్ మార్కెట్ లో రేపు రియల్‌మి 14X స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ రూ.15,000 కంటే తక్కువ ధరలో లాంచ్ కానుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఆసక్తికరంగా ఈ హ్యాండ్‌సెట్ IP69 రేటింగ్ తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
ఇటీవల విడుదల అయిన వివరాల ఆధారంగా రియల్‌మి 14x స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 50 శాతం ఛార్జింగ్ ను కేవలం 38 నిమిషాల్లో పూర్తిచేయవచ్చని మరియు 100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 93 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని రియల్‌మి తెలిపింది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా సహా 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ రియల్‌మి ఫోన్ యెల్లో, బ్లాక్, రెడ్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








