6000mAh బ్యాటరీ. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో రియల్‌మి P3 అల్ట్రా ఫోన్.. విడుదల తేదీ వెల్లడి..!
భారత్ మార్కెట్ లో గత నెలలో రియల్‌మి P3 సిరీస్ (Realme P3 Series) విడుదల అయింది. ఇందులో భాగంగా రియల్‌మి P3x 5G, రియల్‌మి P3 ప్రో మోడల్స్ లాంచ్ అయ్యాయి. త్వరలో ఈ సిరీస్ నుంచి అల్ట్రా వేరియంట్ విడుదల కానుంది. గత వారం ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన ఫోటోను విడుదల చేసిన రియల్‌మి తాజాగా విడుదల తేదీని లాంచ్ చేసింది. రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ పేరుతో లాంచ్ కానుంది. దీంతోపాటు ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.
రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ (Realme P3 Ultra Smartphone Launch Date) భారత్ మార్కెట్‌లో మార్చి 19 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ విషయాన్ని రియల్‌మి వెల్లడించింది. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్ రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉండనుంది.

డ్యూయల్ కెమెరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ వివరాలు ఇటీవలే విడుదల అయ్యాయి. కెమెరా మాడ్యూల్ వృత్తాకార కెమెరా యూనిట్‌లను కలిగి ఉంటుందని మరియు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
చిప్‌సెట్ :
రియల్‌మి P3 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపింది. భారత్‌లో ఈ చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే తొలి ఫోన్ ఇదేనని రియల్‌మి చెబుతోంది. ఈ చిప్‌సెట్ గరష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 తో జతచేసి ఉంటుందని తెలిపింది.

6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ AnTuTu స్కోర్ 1,450,000 గా ఉందని తెలిపింది. మరియు 6050mm2 VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని రియల్‌మి వెల్లడించింది. ఈ అల్ట్రా మోడల్ వేరియంట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిపింది.
కొన్ని లీక్స్ ఆధారంగా ఆండ్రాయిడ్ 15 OS ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అల్ట్రా స్మూత్ పనితీరును అందిస్తుందని సమాచారం. మరియు మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని రియల్‌మి చెబుతోంది. మరిన్ని వివరాలు ఈనెల 13 వ తేదీన విడుదల కానుంది.
రియల్‌మి P3 సిరీస్‌లో ఇప్పటికే ప్రో, P3x 5G మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. బేస్ వేరియంట్ 50MP + 2MP + 8MP (సెల్ఫీ) కెమెరాలను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. 6GB/128GB వేరియంట్ ధర రూ.13,999, 8GB/128GB ధర రూ.14,999 గా ఉంది.
రియల్‌మి P3 ప్రో 5G ఫోన్ 6.83 అంగుళాల 1.5k క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 50MP + 2MP+ 16MP (సెల్ఫీ) కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.21999 గా ఉంది.


Click it and Unblock the Notifications








