Home
Mobile

ఇండియాలో రియల్‌మీ P3x 5G గ్రాండ్ ఎంట్రీ.. డిజైన్, కలర్స్ చూస్తే కొనకుండా ఉండలేరు భయ్యో..!!

Realme P3x 5G: రియల్‌మీ లవర్స్‌కు ఆ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు కొత్త ఫోన్లను ఒకేసారి లాంచ్ చేస్తున్నామని ప్రకటించింది. అవే రియల్‌మీ P3x 5G, రియల్‌మీ P3 ప్రో. ఈ రెండు ఫోన్లు 2025, ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ కానున్నాయి. లాంచ్ అయిన వెంటనే ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్లు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.

రియల్‌మీ P3x 5G మొబైల్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కొద్ది గంటల క్రితమే ప్రకటించింది. కంపెనీ ప్రకారం, రియల్‌మీ P3x 5G ఫోన్ లూనార్ సిల్వర్ (Lunar Silver), మిడ్‌నైట్ బ్లూ (Midnight Blue), స్టెల్లార్ పింక్ (Stellar Pink) వంటి మూడు రంగుల్లో వస్తుంది. ఒక్కో కలర్‌కి ఒక్కో స్పెషల్ టచ్ ఇచ్చారు.

Realme P3x 5G Launching Soon  Discover Its Stunning Design  Ultra-Slim Build  amp amp  Mystery Features

లూనార్ సిల్వర్ అనేది మామూలు సిల్వర్ కాదు. 'స్టెల్లార్ ఐస్‌ఫీల్డ్ డిజైన్'తో వస్తుంది. మైక్రోన్-లెవెల్ చెక్కడంతో చేసిన టెక్స్‌చర్డ్ గ్లాస్ బ్యాక్ ఇది. లైట్ పడితే చాలు, రంగులు మారుస్తూ మాయ చేస్తుంది ఈ ఫోన్. మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లార్ పింక్ వంటి రెండు కలర్స్ వెగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తాయి.

చేతిలో పట్టుకుంటే మృదువుగా ఉంటుంది. గ్రిప్ కూడా దొరుకుతుంది, జారిపోతుందనే భయం అవసరం లేదు. రియల్‌మీ P3x 5G చాలా సన్నగా, కేవలం 7.94mm మందంతో ఉంటుంది. పట్టుకోవడానికి, వాడటానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ముందు కెమెరా కోసం పంచ్-హోల్ డిస్‌ప్లే, సన్నని బెజెల్స్, కొంచెం మందంగా ఉండే చిన్ ఉంటాయి.

వెనుకవైపు టాప్ లెఫ్ట్ కార్నర్‌లో నిలువుగా రెండు కెమెరాలుంటాయి. ఇవి కూడా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఓవరాల్ మొబైల్ డిజైన్‌ను మరింత స్టైలిష్ గా మారుస్తాయి. ఇక ఈ కొత్త మొబైల్ ధర, ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

* రియల్‌మీ P3x 5G స్పెసిఫికేషన్లు

కంపెనీ ఇంకా రియల్‌మీ P3x 5G ఫోన్ అన్ని ఫీచర్లు బయట పెట్టలేదు. ప్రాసెసర్ ఏంటి, డిస్‌ప్లే ఎలా ఉంటుంది, కెమెరాలు ఎన్ని మెగాపిక్సెల్స్, బ్యాటరీ ఎంత ఉంటుంది.. ఇలాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ, రియల్‌మీ ఇంతకుముందు ఫోన్లు చూస్తే, ఇది మాత్రం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తుందని మాత్రం చెప్పొచ్చు.

లాంచ్ డేట్ దగ్గర పడే కొద్దీ మరిన్ని డీటెయిల్స్ వస్తాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. కనీసం ఎక్స్‌పెక్టెడ్ ఫీచర్లు కూడా అందుబాటులో లేవు కాబట్టి దీని స్పెసిఫికేషన్లు ప్రస్తుతానికి ఒక మిస్టరీ అనే చెప్పుకోవచ్చు. లాంచ్ అయ్యాక ఇది నిరాశ పరచదని చాలామంది టెక్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

* ప్రీమియం ఫీచర్లతో రియల్‌మీ P3 ప్రో

రియల్‌మీ P3x 5Gతో పాటు, రియల్‌మీ P3 ప్రో కూడా లాంచ్ అవుతోంది. ఇది మాత్రం ఇంకాస్త అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు గ్లో-ఇన్-ది-డార్క్ ప్యానెల్ ఉంటుంది. అంటే చీకట్లో వెలుగుతుంది. క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో చాలా స్టైలిష్‌గా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది కాబట్టి, పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోతుంది.

ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఏరోస్పేస్-గ్రేడ్ VC కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. గేమ్స్ ఆడేవాళ్లకు, వీడియోలు చూసేవాళ్లకు ఇది సూపర్ ఫీచర్. రియల్‌మీ P3 ప్రోలో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మందం 7.99mm మాత్రమే. IP66, IP68, IP69 రేటింగ్స్‌తో వస్తుంది.

ఈ ఫోన్‌ని అంటే దుమ్ము, నీళ్లు ఏమీ చేయలేవు. గేమింగ్ టెక్నాలజీతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇక కలర్స్ విషయానికొస్తే, గెలాక్సీ పర్పుల్ (Galaxy Purple), నెబ్యులా గ్లో (Nebula Glow), సాటర్న్ బ్రౌన్ (Saturn Brown) రంగుల్లో లభిస్తుంది. అన్నీ కలర్స్ చాలా బాగున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
The Realme P3x 5G is launching in India on February 18 with a slim 7.94mm design, textured glass or vegan leather back, and a dual-camera setup. Full specifications are yet to be revealed.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X